సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:08 PM
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ అన్నారు. శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీ లించారు.

చెన్నూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ అన్నారు. శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు వైద్యం అందించాలని సూచిం చారు. వైద్యులు, సిబ్బంది స్ధానికంగా ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం, విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంపై ఫిర్యా దులు వస్తున్నాయన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవుల్లో వెళ్లేవారు ముందే మం జూరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేమనపల్లి, కోటపల్లి, అంగ్రాజ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గర్భిణీలను ప్రస వాల కోసం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, జగదీష్, వెంకటసాయి తదితరులు ఉన్నారు.