అవకతవకలు లేకుండా సర్వే చేపట్టాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:31 PM
అవక తవకలు, పొరపాట్లు లేకుండా రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక జాబితాను తయారు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సి పాలిటీలోని 5వ వార్డు, మండలంలోని ఎల్లారం, గుల్లకోట గ్రామంలో సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తోందన్నారు.

లక్షెట్టిపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అవక తవకలు, పొరపాట్లు లేకుండా రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక జాబితాను తయారు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సి పాలిటీలోని 5వ వార్డు, మండలంలోని ఎల్లారం, గుల్లకోట గ్రామంలో సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు అందించేందుకే అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా అర్హులైన లబ్ధి దారునికి పథకాలు, ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని ఆదేశిం చారు. జాబితాను పరిశీలించి రేషన్ కార్డు దరఖాస్తుల పూర్తి వివరాలను నమోదు చేయా లని, నిబంధనలు తప్పకుండా పాటించాల న్నారు. మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎంపీడీవో సరోజ తదితరులు ఉన్నారు.
దండేపల్లి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు అందించే విధంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ముత్యంపేట, చింతపల్లి, మేదరిపేట గ్రామాల్లో కొనసాగు తున్న రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వేను అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సం క్షేమ పథకాల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి జాబితా రూపొందించాలని ఆదేశించారు. రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారి వార్షిక ఆదాయం 1లక్ష 50వేలు, ఎకరం భూమిలోపు ఉన్న వారు అర్హు లన్నారు. రేషన్‌కార్డులో పేర్ల తొలగింపు, చేర్పు లు, నూతన రేషన్ కార్డులకు అర్హత గల వారి జాబితాను రూపొందించాలన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామాల్లో జరిగే గ్రామసభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లను చదివి విని పించాలన్నారు. తహసీల్దార్ సంధ్యరాణి, ఎంపీ డీవో ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అంజిత్‌కమార్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, ఆర్‌ఐ భూమన్న, ఏఈవోలు, కార్యదర్శులు ఉన్నారు.