Share News

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:56 PM

రైతుభరోసా, రేషన్‌కార్డుల సర్వేను పకడ్బం దీగా చేపట్టాలని ఆర్డీవో హరికృష్ణ సూచిం చారు. శనివారం కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆర్డీవో మాట్లాడుతూ తప్పులు లేకుం డా వివరాలను నమోదు చేయాలని పేర్కొ న్నారు.

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

వేమనపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా, రేషన్‌కార్డుల సర్వేను పకడ్బం దీగా చేపట్టాలని ఆర్డీవో హరికృష్ణ సూచిం చారు. శనివారం కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆర్డీవో మాట్లాడుతూ తప్పులు లేకుం డా వివరాలను నమోదు చేయాలని పేర్కొ న్నారు. తహసీల్దార్‌ రమేష్‌, ఏఈవో రుక్సార్‌ సుల్తానా, కార్యదర్శి శ్యామ్‌ పాల్గొన్నారు.

తాండూర్‌, (ఆంధ్రజ్యోతి): నర్సింగాపూర్‌, నర్సాపూర్‌లో జరుగుతున్న రైతు భరోసా సర్వేను మండల పంచాయతీ అధికారి అని ల్‌కుమార్‌ పరిశీలించారు. ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ పట్టాదారులు కూడా రైతుభరోసాకు అర్హుల న్నారు. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమో దైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీ ర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి జగదీష్‌ ఉన్నారు. చంద్రవెల్లి, రాం పూర్‌లో అధికారులు సాగుకు యోగ్యం కాని భూముల వివరాలకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి సుష్మ, అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ అధికారి శంకర్‌, కార్యదర్శులు కార్తీక్‌రాజు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): అం దుగులపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో రైతుభరోసా సర్వే నిర్వహించారు. రైతు లు సాగు చేస్తున్న భూముల వివరాలను సేకరించారు. ఏయే సర్వే నెంబర్లలో రైతులు సాగు చేస్తున్నారు, సాగుకు అనుకూలంగా ఉన్నాయా లేదా పరిశీలించి నమోదు చేసు కున్నారు. ఏడీ బానోత్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, వ్యవసాయాధికారి జ్యోతి ర్మయి, కాంగ్రెస్‌ మండల ఇన్‌చార్జీ కడారి జీవన్‌కుమార్‌, ఏఈవో తిరుపతి, ఆర్‌ఐ గణపతి, కార్యదర్శి వీరేందర్‌ పాల్గొన్నారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): భీమారంలో కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల సర్వేను నిర్వ హించారు. దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్నారు. కార్య దర్శి కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

కాసిపేట, (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా, రేషన్‌కార్డుల సర్వేను పారదర్శకంగా నిర్వ హించాలని మండల ప్రత్యేకాధికారి సాంబ శివరావు అన్నారు. కొండాపూర్‌, కోనూరు గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పకడ్బం దీగా చేపట్టాలన్నారు. ఎంపీవో సప్దర్‌ ఆలీ, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీనారాయణ, సహా యకులు తిరుపతి, రజిత పాల్గొన్నారు.

దండేపల్లి, (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథ కాల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్‌ సంధ్యరాణి సూచించారు. వెల్గ నూర్‌, కన్నెపల్లి, లింగాపూర్‌ గ్రామాల్లో చేప ట్టే రైతుభరోసా, రేషన్‌కార్డుల సర్వేను పరిశీ లించారు. ఆమె మాట్లాడుతూ సాగుకు యో గ్యం కాని భూములను సిబ్బంది క్షేత్రస్థా యిలో సర్వే చేయాలన్నారు. రేషన్‌కార్డులు లేని వారి వివరాలను సేకరించాలన్నారు. డిప్యూటీ తహసల్దార్‌ విజయ, ఏఈవో, రెవెన్యూ శాఖ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 10:56 PM