Home » Accident
పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు.
డివైడర్ పక్కన ఆగివున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆ బస్సు డ్రైవర్, ఓ ప్రయాణికురాలు దుర్మరణంపాలయ్యారు. 16 మందికి గాయాలయ్యాయి.
కొవ్వూరు మండలంలో జరిగిన రాత్రి లారీ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పొన్నారు. లారీ డ్రైవర్ ప్రమాదానికి గురై రోడ్డుపై నిలబడి వెనుక వాహనాలకు సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఐషర్ వ్యాన్ అతన్ని ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగింది.
Noida Road Rage Incident: సోషల్ మీడియాలో ఇద్దరు నెటిజన్ల మధ్య చెలరేగిన లొల్లి యాక్సిడెంట్‌కు దారితీసింది. దారుణంగా కామెంట్ చేశాడనే కారణంతో ఓ వ్యక్తి ప్లాన్ ప్రకారం సదరు నెటిజన్ను కారుతో గుద్దేసి పారిపోయాడు.
ముగ్గురు యువకులు బైకుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోడ్ల కూడలిలోకి రాగానే ఎదురుగా మినీ వ్యాన్ వస్తుంటుంది. ఈ క్రమంలో బైకు కాలువలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన యువకుడిని చూసి అంతా షాక్ అవుతున్నారు..
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు మృతిచెందిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర జరిగింది. ఏపీలోని అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే.. హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.
కొంత మంది ఒక వివాహ వేడుకకు సంతోషంగా వెళ్లి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు పల్టీ కొట్టింది (Hardoi car accident). దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా..
రాజమండ్రి గామన్ వంతెనపై లారీ డివైడర్ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కడప జిల్లా బద్వేలు ఘాట్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగి ఉన్న కారుపై దూసుకెళ్లడంతో నాలుగుగురు మృతి చెందారు. మృతుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులు, అక్కాతమ్ముడు ఉన్నారు.