Commuter Deaths: అత్యంత బాధాకరం.. నలిగిపోయి, విగతజీవులుగా మారుతున్నారు
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:05 PM
ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకి వచ్చాయి. అయితే, ఇవన్నీ నివారించగలిగే అపాయాలే. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ముంబై లోకల్ ట్రైన్స్ ప్రమాదాల్లో చనిపోయిన వారెంతమందో తెలుసా.. అక్షరాలా 922 మంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకి వచ్చాయి. అయితే, ఇవన్నీ నివారించగలిగే అపాయాలే కావడం మరింత బాధాకరం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ముంబై లోకల్ ట్రైన్స్ ప్రమాదాల్లో చనిపోయిన వారెంతమందో తెలుసా.. అక్షరాలా 922 మంది.
ముంబైలో కేవలం 5 నెలల్లో 922 మంది ప్రయాణికులు తమ అమూల్యమైన ప్రాణాల్ని కోల్పోయారు. వీటిలో 210 మంది నడుస్తున్న రైళ్ల నుంచి కింద పడి మరణించారు. జనవరి 1 - మే 31, 2025 మధ్య ముంబైలో స్థానిక రైలు ప్రయాణికులు ఇలా ప్రాణాలు కోల్పోయారని లెక్కలు చెబుతున్నాయి.
సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వచ్చిన సమాధానం ప్రకారం.. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ ఇచ్చిన తాజా లెక్కలివి. నగర జీవనాధారంగా చెప్పబడే ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో కొనసాగుతున్న భద్రతా సంక్షోభానికి భయంకరమైన గుర్తులుగా వీటిని చెప్పుకోవాల్సిన పరిస్థితి.

ప్రతీ రోజూ ఉండే రైల్వే ప్రయాణికుల రద్దీ, బోగీల సంఖ్య తక్కువగా ఉండటం, ప్లాట్‌ఫామ్స్ మీద భద్రతా చర్యలు లేకపోవడం వల్ల లక్షలాది మంది రోజువారీ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. ఇది ప్రజారోగ్యం, ఇంకా భద్రతా అత్యవసర పరిస్థితిని సూచిస్తోందని .. నగరానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అజయ్ బోస్ అంటున్నారు. నివారించగల కారణాలతో మనం దాదాపు ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ నివేదిక ద్వారా వచ్చిన మిగతా లెక్కల్ని పరిశీలిస్తే, ఈ కాలంలో మిగిలిన 712 ప్రమాద మరణాలు ట్రాక్‌లను దాటడం సహా వివిధ కారణాల వల్ల సంభవించాయి. కాగా, ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ, పశ్చిమ, మధ్య ఇంకా హార్బర్ లైన్లలో ప్రతిరోజూ 7 మిలియన్లకు పైగా ప్రయాణికులు వివిధ ట్రైన్లలో తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ రోజూ వారి ప్రయాణం దినదిన గండంగా ఉంది.

Also Read:
బంపర్ ఆఫర్.. ఆ పిల్లిని పెంచితే కోట్ల ఆస్తి మీదే
బుడ్డోడి ఆవేశం మామూలుగా లేదుగా..
For More Andhra Pradesh News and Telugu News..