Share News

Pune Girl Window Video: మూడో ఫ్లోర్లో ముచ్చెమటలు పట్టించిన పాప..

ABN , Publish Date - Jul 08 , 2025 | 07:40 PM

పూణెలో నాలుగేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆటాడుకునే క్రమంలో మూడో అంతస్తులో కిటికీ గ్రిల్‌లో నుంచి కిందకు పడబోయింది. అయితే, అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారి బతికిపోయింది.

Pune Girl Window Video: మూడో ఫ్లోర్లో ముచ్చెమటలు పట్టించిన పాప..
Pune Girl Stuck in Window Viral Video

Pune Girl Stuck in Window Viral Video: మహారాష్ట్రలోని జరిగిన ఓ హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూణెలో ఓ భవనంలోని మూడో అంతస్తు నుంచి నాలుగేళ్ల బాలిక జారిపడబోయింది. ఆటలాడుకుంటూ కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి కిటికీ నుంచి కిందకు చాలాసేపు వేలాడుతూనే ఉంది. సొసైటీలో నివసించేవారు ఇది గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో అక్కడే నివసిస్తున్న అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ పాపను కాపాడేందుకు ముందుకొచ్చారు. అత్యంత చాకచక్యంగా కిటికీలో ఇరుక్కుపోయిన బాలికను ఇంట్లోకి లాగేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.


పూణేలోని గుజార్ నింబల్కర్వాడి ప్రాంతంలోని సోనావానే భవనంలో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి భావిక తల్లి తన పెద్ద కుమార్తెను పాఠశాల్లో దింపడానికి ఫ్లాట్‌కు బయటి నుండి తాళం వేసి వెళ్లిపోయింది. ఆ సమయంలో పాప ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆడుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్న కిటికీలోని ఇనుప గ్రిల్‌లోంచి దాదాపు పూర్తిగా బయటకు వచ్చేసింది. కిటీకి లోపలి వైపు తల ఇరుక్కుపోగా, బయటి వైపు మిగిలిన శరీర భాగం వేలాడుతూ ఉంది. మూడో అంతస్తులోని కిటికీ నుంచి పాప జారిపడుతున్న దృశ్యాలు కింద నిలబడి ఉన్న వ్యక్తులు గమనించారు. వెంటనే, గట్టిగా కేకలు వేయడంతో ఆ ప్రాంతం అంతటా కలకలం రేగింది.


సొసైటీలోని ప్రజలు బిగ్గరగా అరవడం ప్రారంభించారు. వెంటనే సహాయం కోసం అరిచారు. అదే సమయంలో అదృష్టవశాత్తూ కోత్రుడ్ అగ్నిమాపక కేంద్రంలో పనిచేసే యోగేష్ చవాన్ సెలవులో ఉన్నాడు. అదే భవనంలో నివసిస్తున్న ఆయన బయట అందరూ గట్టిగట్టిగా అరవడం చూసిన వెంటనే విషయం తెలుసుకుని ఆలస్యం చేయకుండా మూడో అంతస్తుకు పరుగెత్తాడు. అయితే ఆ సమయంలో ఫ్లాట్ తలుపు లాక్ చేసి ఉంది. అయినా, చవాన్ ఇంటి తాళాలు తీసుకుని లోపలికి వెళ్లి కిటికీ నుంచి బాలికను ఇంట్లోకి లాగాడు. అతడు వేగంగా స్పందించడంతో భావికకు ప్రాణాపాయం తప్పింది.


ఇవి కూడా చదవండి..

రాముడు మావాడే.. శివుడూ మావాడే

పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 08:32 PM