Home » ABN
తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో చెడ్డీ గ్యాంగ్ సంచారంపై స్థానికుల్లో భయాందోళనలు నెలకొనగా.. పోలీసులు అప్రమత్తమై నగర శివారు ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ హవిల్దార్ కువ్వారపు కిషన్ మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
బోస్టన్‌లో TANA న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతికూల వాతావరణం మధ్య 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరుకాగా, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ గాయకులు ఎన్టీఆర్ చిత్రాల పాటలతో అలరించారు.
బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన మేనమామ, మేనల్లుడు అనంత లోకాలకు చేరారు.
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుంది.
ఆసియా క్రీడల్లో షూటర్ నీరూ దాండా చరిత్ర సృష్టించింది. ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా నిలిచిన ఆమె.. కైనన్ చెనైతో కలిసి మిక్స్‌డ్ టీమ్ ట్రాప్‌లోనూ బంగారు పతకం గెలిచింది. ఈ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి టీమ్ఇండియాకు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (బుధవారం) సిరిసిల్లలో పర్యటనలో భాగంగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ మరోసారి కాంస్య పతకం సాధించాడు. పురుషుల 87 కేజీల విభాగంలో 9-0తో గెలిచి, ఆసియా క్రీడల్లో రెండు గ్రీకో-రోమన్ పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు.
అమెరికాలో స్థిరపడాలని ఆశతో బయలుదేరిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు విదేశాల్లో అదృశ్యమయ్యారు. వీరిని అపహరించినట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడం, రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.