Home » ABN Andhrajyothy
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు.
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
అమెరికాలో 2017లో జరిగిన జంట హత్యల కేసులో ఇటీవల నిందితుణ్ని గుర్తించిన అధికారులు.. ఈ కేసు పురోగతిలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిపై భారీ రివార్డ్ ప్రకటించారు.
కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో గురువారం బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క మరణించింది. ఈ పేలుడుపై జిల్లా ఎస్పీ స్పందించారు.
ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఐ బొమ్మ మూసివేశాం.. తర్వాత ఏమిటంటూ అతడిని పోలీసులు ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది.
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.