Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. కుట్ర కోణం లేదు: జిల్లా ఎస్పీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:26 PM
కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో గురువారం బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క మరణించింది. ఈ పేలుడుపై జిల్లా ఎస్పీ స్పందించారు.
కొత్తగూడెం, డిసెంబర్ 03: కొత్తగూడెం రైల్వే స్టేషన్ (భద్రాచలం రోడ్డు)లో గురువారం నాటు బాంబు పేలుడు ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. అడవి జంతువుల కోసం ఈ నాటు బాంబులు వినియోగిస్తున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాంబులు ఉన్న సంచులను చెత్త కుప్పలో పడేశారని వివరించారు. ఆ సంచులను వీధి కుక్కలు రైల్వే ట్రాక్‌పై తీసుకు వచ్చి.. అందులోని వస్తువులను తినే ప్రయత్నం చేశాయని చెప్పారు. ఆ క్రమంలో నాటు బాంబు పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ఈ పేలుడు ధాటికి కుక్క మృతి చెందిందన్నారు.
గురువారం ఉదయం కొత్తగూడం రైల్వే స్టేషన్‌లో బాంబు పేలింది. ఈ భారీ పేలుడుతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుడుపై సమాచారం అందుకున్న స్థానిక 3 పట్టన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే బాంబు పేలుడులో ఏమైనా కుట్ర కోణం ఉందా అంటూ విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు
For More TG News And Telugu News