Ind Vs SA: టాస్ ఓడిన భారత్
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:22 PM
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా వన్డేల్లో భారత్ 20వ సారి టాస్ ఓడటం గమనార్హం.
టాస్ సందర్భంగా కెప్టెన్లు మాట్లాడారు.‘మేము బౌలింగ్ ఎంచుకుంటున్నాం. డ్యూ ప్రభావం ఉంటుంది కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మాకు సులువు అవుతుంది. జట్టులో మూడు మార్పులు జరిగాయి. ఈ రెండో వన్డేకు నేను, కేశవ్ మహరాజ్, ఎంగిడి అందుబాటులోకి వచ్చాం. మా జట్టుకు బౌలర్లు శుభారంభాన్ని అందిస్తే.. గెలుపు మాదే. తొలి వన్డే విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం’ అని సఫారీల కెప్టెన్ టెంబా బవూమా తెలిపాడు.
‘సుదీర్ఘ కాలంగా వన్డేల్లో మేం టాస్ ఓడిపోతున్నాం. టాస్ కంటే డ్యూనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. టాస్ ఓడినా తొలి వన్డేలో విజయం సాధించాం. అదే పట్టుదలతో రెండో వన్డే ఆడనున్నాం. భారీ స్కోరు చేసి.. వికెట్లు పడకుండా చూసుకుంటే విజయం మాదే. పిచ్ మాత్రం బ్యాటింగ్‌కే అనుకూలిస్తుంది అనుకుంటున్నా. తుది జట్టులో మార్పు లేదు’ అని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
భారత్ తుది జట్టు:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ.
సౌతాఫ్రికా తుది జట్టు:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్‌క్రమ్, టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డీ జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సన్, కోర్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.
ఇవి కూడా చదవండి:
మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!
అరుదైన మైలురాయికి చేరువలో హిట్‌మ్యాన్!