• Home » 2024

2024

DEATH : మహేశ్వర్‌ రెడ్డి మృతిపై అనుమానాలు

DEATH : మహేశ్వర్‌ రెడ్డి మృతిపై అనుమానాలు

ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశర్‌రెడ్డి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యా ప్తు జరపాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. సో ములదొడ్డి సమీపంలో రైలు పట్టాల వద్ద పడిఉన్న ఉమా మహే శ్వర్‌ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

VADDERA SANGHAM : వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

VADDERA SANGHAM : వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

వడ్డెర్ల సమస్యలను ఎప్పటికప్పుడురాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తామని వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి పేర్కొన్నారు. నగరంలోని వడ్డెర్ల సంఘం కార్యాలయంలో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన దేవళ్ల మురళికి ఉమ్మడి అనంత జిల్లా వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కుంచెపు వెంకటేష్‌, నాయకులు మంజు నాథ్‌, దళవాయి కుమార్‌, గంగరాజు శాలువ కప్పి, పూల మాల వేసి ఘనంగా సన్మానించారు.

MINISTER : ప్రమాణ స్వీకారానికి రండి

MINISTER : ప్రమాణ స్వీకారానికి రండి

నాయీ బ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర చైర్మన, డైరెక్టర్ల ప్రమాణ స్వీ కార కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను నాయీబ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్లు కడియాల కొండన్న, ఆదినారాయణ ఆహ్వానించారు. వారు బుధవారం పెనుకొండలో మంత్రిని కలిసి ఆమెకు శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు.

MLA : పేదలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం

MLA : పేదలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం

పేద ప్రజలకు ఇళ్లు కట్టి స్తామంటూ, వారితో డబ్బులు తీసుకొని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింద ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ మండిపడ్డారు. నగరంలో 35వ డివిజన మంగళవారి కాలనీలో బుధవారం మీ ఇంటికి-ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిం చారు. మాజీ కార్పొరేటర్‌ రాజారావు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజల తో సమస్యలపై ఆరాతీశారు. డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత స్తంభాలు సరిగా లేకపోవడం తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

CORPORATION : అయోమయం..!

CORPORATION : అయోమయం..!

నగరపాలికకు కమిషనర్‌ ఎవరని ప్రశ్నిస్తే... అటెండర్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంతటి అయోమయం నెలకొంది. రెగ్యులర్‌ కమిషనర్‌ నాగరాజు దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లడంతో, ఇనచార్జ్‌గా వచ్చిన అడిషనల్‌ కమిషనర్‌ కూడా సెలవులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి అడ్మినిస్ర్టేటర్‌గా ఉన్న మల్లికార్జునరెడ్డిని ఇనచార్జ్‌ కమిషనర్‌గా నియమించారు.

GOD : ఘనంగా పెద్దమ్మ జాతర

GOD : ఘనంగా పెద్దమ్మ జాతర

మండల పరిధిలోని కోటంక గ్రామంలో మంగళవారం పెద్దమ్మ దేవత జాతర ఘనంగా జరిగింది. గ్రామంలోని తొగట వీరక్షత్రియులు సోమవారం రాత్రి చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం పెద్దమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు.

TDP : జగనది స్వార్థం... చంద్రబాబుది ప్రజా సేవ

TDP : జగనది స్వార్థం... చంద్రబాబుది ప్రజా సేవ

విశాఖ ఉక్కు పరిశ్రమను 2002లో ఆర్థిక నష్టాల్లో నుంచి కాపాడింది, నే డు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీ పీ ధర్మవరం నియోజకవర్గ ఇన చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో మంగళవారం విలేకరుల సమావే శంలో వారు మాట్లాడుతూ.... విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటికరణ చేయ కుండా ఆపడంపై హర్షం వ్యక్తం చేశారు.

TDP : జగన రాష్ర్టాన్ని తాకట్టు పెట్టారు

TDP : జగన రాష్ర్టాన్ని తాకట్టు పెట్టారు

గత ఐదేళ్లల్లో తన కేసులు కొట్టివేయించుకు నేం దుకు జగన రాష్ర్టాన్ని తాకట్టుపెట్టారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నాన్ని రాజధాని చే స్తానంటూ జగన ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.

ROADS : ఈ రోడ్లకు మోక్షం ఎప్పుడో..?

ROADS : ఈ రోడ్లకు మోక్షం ఎప్పుడో..?

గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామీణ రోడ్లకు నేటికీ మోక్షం లేకుండా పోతోంది.. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయా నికి గత పాలన చర్యలు గండి కొడుతున్నాయి. ఫలితంగా సంక్రాంతి ముగిన ప్పటీకి ఈ రోడ్లకు మోక్షం లేకుండా పోయింది. మండలంలోని శింగనమల రోడ్డు నుంచి గోవిందరాయునిపేట వెళ్లే రోడ్డుకు వైసీపీ పాలనలో కంకర వేసి ఆర్ధంతరంగా నిలిపివేశారు.

GOD : కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

GOD : కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి