ROADS : ఈ రోడ్లకు మోక్షం ఎప్పుడో..?
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:23 AM
గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామీణ రోడ్లకు నేటికీ మోక్షం లేకుండా పోతోంది.. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయా నికి గత పాలన చర్యలు గండి కొడుతున్నాయి. ఫలితంగా సంక్రాంతి ముగిన ప్పటీకి ఈ రోడ్లకు మోక్షం లేకుండా పోయింది. మండలంలోని శింగనమల రోడ్డు నుంచి గోవిందరాయునిపేట వెళ్లే రోడ్డుకు వైసీపీ పాలనలో కంకర వేసి ఆర్ధంతరంగా నిలిపివేశారు.
శింగనమల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామీణ రోడ్లకు నేటికీ మోక్షం లేకుండా పోతోంది.. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయా నికి గత పాలన చర్యలు గండి కొడుతున్నాయి. ఫలితంగా సంక్రాంతి ముగిన ప్పటీకి ఈ రోడ్లకు మోక్షం లేకుండా పోయింది. మండలంలోని శింగనమల రోడ్డు నుంచి గోవిందరాయునిపేట వెళ్లే రోడ్డుకు వైసీపీ పాలనలో కంకర వేసి ఆర్ధంతరంగా నిలిపివేశారు. గత మూడేళ్లగా అదే పరిస్థితి ఉంది. అలాగే లోలూరు క్రాస్ నుంచి ఆకులేడు, మదిరేపల్లికి వెళ్లే ఏడు కిలో మీటర్ల రోడ్డులో అడుగడుగున గుంతలే. అలాగే కల్లుమడి నుంచి గుమ్మేపల్లి వరకు రోడ్డు మరీ దారుణంగా ఉంది. గోవిందురాయునిపేట నుంచి ఈస్టు నరసాపురం రోడ్డు, కల్లూరు నుంచి తరిమెల వెళ్లు రోడ్లపై ప్రయాణ చేయా లంటే ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభత్వం సృందించి గ్రామాల్లో అర్ధంతంగా నిలిసిపోయిన రోడ్ల పనులతో పాటు మరి కొన్ని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....