MLA : పేదలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:43 AM
పేద ప్రజలకు ఇళ్లు కట్టి స్తామంటూ, వారితో డబ్బులు తీసుకొని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింద ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. నగరంలో 35వ డివిజన మంగళవారి కాలనీలో బుధవారం మీ ఇంటికి-ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిం చారు. మాజీ కార్పొరేటర్ రాజారావు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజల తో సమస్యలపై ఆరాతీశారు. డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత స్తంభాలు సరిగా లేకపోవడం తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం అర్బన, జనవరి22(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు ఇళ్లు కట్టి స్తామంటూ, వారితో డబ్బులు తీసుకొని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింద ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. నగరంలో 35వ డివిజన మంగళవారి కాలనీలో బుధవారం మీ ఇంటికి-ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిం చారు. మాజీ కార్పొరేటర్ రాజారావు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజల తో సమస్యలపై ఆరాతీశారు. డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత స్తంభాలు సరిగా లేకపోవడం తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఇంటి కోసం రూ.25వేలు చెల్లించినా, ఇప్పటిదాకా అతీగతీలేదని ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రజలను మో సం చేశారని మండిపడ్డారు. ఎంతో ఆశతో పేదలు ఇంటి కోసం డబ్బులు చెల్లిస్తే, అసలు అవి ఏమయ్యాయో చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ నూతనంగా ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మరో సారి దీనిపై సమగ్ర సర్వే చేయించి, వివరాలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాయల్ మురళి, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎల్‌ఎన మూర్తి, కడియాల హరి, గోళ్ల సుధాకర్ నాయుడు, సైఫుద్దీన, ఓంకార్‌రెడ్డి, ఇస్మాయిల్, చరిత, వర్నూరప్ప, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
అర్బన పరిధిలోని ఐదు గురికి రూ.4,02,300 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందజేశారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాల యంలో బుధవారం అల్లీపీరా, జప్పార్ బాషా, శేషమ్మ, రాయుడు, వడ్డె పవన కుమార్ అనే ఐదుగురికి ఎమ్మెల్యే చెక్కులను అందించారు. వారు ఎమ్మెల్యేకి కృతజ్ఙతలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... అర్బన విషయంలో సీఎం ఉదారంగా సాయం అందిస్తున్నారన్నారు. సీఎంకు నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సైఫుద్దీన, గోపాల్ గౌడ్, ముక్తియార్, రమేష్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....