Share News

TDP : జగనది స్వార్థం... చంద్రబాబుది ప్రజా సేవ

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:30 AM

విశాఖ ఉక్కు పరిశ్రమను 2002లో ఆర్థిక నష్టాల్లో నుంచి కాపాడింది, నే డు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీ పీ ధర్మవరం నియోజకవర్గ ఇన చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో మంగళవారం విలేకరుల సమావే శంలో వారు మాట్లాడుతూ.... విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటికరణ చేయ కుండా ఆపడంపై హర్షం వ్యక్తం చేశారు.

TDP : జగనది స్వార్థం... చంద్రబాబుది ప్రజా సేవ
Talking Paritalasunita

ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిశ్రమను 2002లో ఆర్థిక నష్టాల్లో నుంచి కాపాడింది, నే డు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీ పీ ధర్మవరం నియోజకవర్గ ఇన చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో మంగళవారం విలేకరుల సమావే శంలో వారు మాట్లాడుతూ.... విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటికరణ చేయ కుండా ఆపడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగన తన కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు వెనుకాడలేదన్నారు. విశా ఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీ కరణకు అన్నివిధాలుగా సహరించేందుకు ఆయన అప్పట్లో సిద్ధమయ్యారన్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీ కరణ కాకుండా అన్ని రకాలుగా ప్రయ త్నాలు చేశారన్నారు. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ ప్లాం టును కాపాడేందుకు రూ.11, 440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని సాధించారన్నారు. నిన్నటి వరకు విశాఖ స్టీల్‌ ప్లాంటుపై దుష్రచారంచేసిన వైసీపీ నాయకులు దీనికి ఏమి సమాధానంచెబుతారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రానికి కూడా కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఇదంతా సీఎం చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ వల్లే సాధ్యమవుతోందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 22 , 2025 | 12:30 AM