Share News

GOD : ఘనంగా పెద్దమ్మ జాతర

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:35 AM

మండల పరిధిలోని కోటంక గ్రామంలో మంగళవారం పెద్దమ్మ దేవత జాతర ఘనంగా జరిగింది. గ్రామంలోని తొగట వీరక్షత్రియులు సోమవారం రాత్రి చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం పెద్దమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు.

GOD : ఘనంగా పెద్దమ్మ జాతర
MLAs Bandaru Shravanishree, Palle Sindhura Reddy and TDP district president Venkatashivudu Yadav are visiting Ammavari.

గార్లదిన్నె, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కోటంక గ్రామంలో మంగళవారం పెద్దమ్మ దేవత జాతర ఘనంగా జరిగింది. గ్రామంలోని తొగట వీరక్షత్రియులు సోమవారం రాత్రి చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం పెద్దమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, కాలవ శ్రీనివాసులు, దగ్గుపాటి ప్రసాద్‌, పల్లె సింఽధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడుయాదవ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాస్‌రెడ్డి, గేటు క్రిష్ణారెడ్డి, సర్పంచు లక్ష్మి, ఎర్రి స్వామి, సుబ్బు తదితర నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామం భక్తులతో కిటకిటలాడింది. శింగనమల సర్కిల్‌ సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌బాషా ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.

రాప్తాడు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మరూరులో మంగళవారంపెద్దమ్మ ఊరి దేవర అంగరంగ వైభవంగా నిర్వ హిం చారు. ఏన్నో ఏళ్ల తర్వాత నిర్వహిస్తుండడంతో జిల్లా నలు మూలల నుంచి భక్తులు హాజరయ్యారు. సోమవారం రాత్రి పెద్దమ్మ, పోతు లయ్య స్వామికి దున్నపోతును బలి ఇచ్చారు. పొట్టేళ్లను అధిక సంఖ్యలో బలి ఇచ్చారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్రామం జనసంద్రంగా మారింది. రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వ ర్లు, రాప్తాడు సీఐ శ్రీ హర్ష, రాప్తాడు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు పలువురు రాజీకీయ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ బీకే పార్థసారఽథి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి తదితరులు హాజరయ్యారు. గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 22 , 2025 | 12:35 AM