CORPORATION : అయోమయం..!
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:39 AM
నగరపాలికకు కమిషనర్ ఎవరని ప్రశ్నిస్తే... అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంతటి అయోమయం నెలకొంది. రెగ్యులర్ కమిషనర్ నాగరాజు దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లడంతో, ఇనచార్జ్‌గా వచ్చిన అడిషనల్ కమిషనర్ కూడా సెలవులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి అడ్మినిస్ర్టేటర్‌గా ఉన్న మల్లికార్జునరెడ్డిని ఇనచార్జ్ కమిషనర్‌గా నియమించారు.
నగరపాలికకు కమిషనర్ ఎవరు?
సారా...? మేడమా..?
మేడమ్ చెబితేనే సార్ చేస్తారట
చాలా ఫైళ్లు పెండింగ్
అనంతపురం క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నగరపాలికకు కమిషనర్ ఎవరని ప్రశ్నిస్తే... అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంతటి అయోమయం నెలకొంది. రెగ్యులర్ కమిషనర్ నాగరాజు దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లడంతో, ఇనచార్జ్‌గా వచ్చిన అడిషనల్ కమిషనర్ కూడా సెలవులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి అడ్మినిస్ర్టేటర్‌గా ఉన్న మల్లికార్జునరెడ్డిని ఇనచార్జ్ కమిషనర్‌గా నియమించారు. ఆయనే ఫైనలా...? ఎవరినైనా రెగ్యులర్ అధికారిని నియమిస్తారా..? అని అనుకునేలోగా శిక్షణ నిమిత్తం వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ తాను ఇనచార్జ్ కమిషనర్‌గా ఉంటానని స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి అయోమయంలో పడింది. నగరపాలి కకు కమిషనర్ తెలియడంలేదు. కానీ సీసీలు ఏకంగా ముగ్గురున్నారు. వారందరూ సచివాలయ ఉద్యోగులే కావడం గమనార్హం. వారూ కొత్తగా వచ్చారు. వారు వచ్చిన నెలల వ్యవధిలోనే ముగ్గురు కమిషనర్లు మారారు. ఏ సమస్యనైనా ఎవరితో చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితి అధికారుల నుంచి సామాన్యుల వరకు ఏర్పడింది. ఇది నగరపాలికలో అయోమయం...జగన్నాథం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది.
మేడమ్ చెబితేనే... సార్ చేస్తారట..!
తమ బిల్లులకు సంబంధించి ఫైళ్ల పెండింగ్‌పై కాంట్రాక్టర్లు ఇనచార్జ్ కమిషనర్ మల్లికార్జునరెడ్డి వద్దకు వెళ్లారట. వాటిని చూసి ఆయన నిట్టూర్చి, తన పై అధికారి ఒకరున్నారని, మేడమ్ ఓకే చేస్తే తాను సంతకాలు పెడతా నని చెప్పారట. ఇలా రెండు మూడు దఫాలుగా జరిగిందని కాంట్రాక్టర్లు చెబు తున్నారు. ఇక మేడమ్ చాంబర్‌కు వెళ్దామంటే.. ఐఏఎస్ అధికారి కదా ఏమంటారోనని అధికారులు, పలు సెక్షన్ల హెచఓడీలు సైతం వెనుకడుగు వే స్తున్నారట. కొన్ని రోజులుగా ఇప్పటివరకు ఒక్క ఫైల్ కూడా అప్రూవల్ కా లేదని సమాచారం. దీంతో అత్యవసకర విషయాల్లో ఎలా స్పందిస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరికి అవగాహన ఉంది...?
నగరపాలికను ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గత ఏడాది డిసెం బరు 13న రెగ్యులర్ కమిషనర్ నాగరాజు సెలవులోకి వెళ్లారు. రామలింగేశ్వర్ జనవరి 7 నుంచి సెలవు బాట పట్టారు. ఈ సందర్భంలో కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రభుత్వాసుపత్రి అడ్మినిస్ర్టేటర్‌గా ఉన్న మల్లికార్జునరెడ్డిని ఇనచార్జ్ కమిషనర్‌గా నియమించారు. సంక్రాంతి పండుగ అనంతరం శిక్షణ నిమిత్తం అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న వచ్చారు. కానీ ఆమె ఇనచార్జ్ కమిషనర్ గా ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరిలో ఎవరికీ నగరపాలికపై పూర్తి అవగాహన లేదనే విషయం సుస్పష్టం. అసిస్టెంట్ కలెక్టర్ నాలుగు వారాల పాటు శిక్షణ పొందనడానికి వచ్చారు. ఇక్కడున్న విభాగాలపై పట్టు సాఽ దించాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది. ఇక ప్రభుత్వాసుపత్రి అడ్మిని స్ర్టేటర్‌కు కేవలం పారిశుధ్యంపై అవగాహన ఉండవచ్చేమో. కీలక ఫైళ్ల విషయంలో ఈ ఇద్దరూ కిందిస్థాయి ఉద్యోగుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ని రోజులుగా రెగ్యులర్ కమిషనర్‌ను నియమించకుండా డీఎంఏ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావం లేదు. ఆదివారం వచ్చిన సీడీఎంఏ హరినారాయణ ప్రతి అంశంపైనా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా 50డివిజన్లున్న ఈ నగరంలో సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ అసిస్టెంట్ కలెక్టర్ సమీక్షలు, ఇతర మీటింగ్ విష యంలో ఎప్పుడు కలెక్టరేట్‌కు వెళ్తారో తెలియదు. మల్లికార్జునరెడ్డి అప్పు డప్పు డూ ప్రభుత్వాసుపత్రిని సందర్శించాల్సి ఉంటుంది. మరి క్షేత్రస్థాయిలో సమస్యలను చూసేదెవరో అంతుబట్టడం లేదు.
సీఎఫ్‌ఎంఎస్‌లో 200 ఫైళ్లు పెండింగ్
నగరపాలికలో వివిధ విభాగాలకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌లో 200 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఎప్పుడు బిల్లు వరకు వెళ్తాయో తెలి యని గందరగోళం నెలకొంది. దీంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం రోజూ కార్పొరేషన చుట్టూ తిరగక తప్పడం లేదు. తాజాగా రూ.6కోట్ల పనులకు సంబంధించి 20కిపైగా పనులకు టెండరు పిలిచారు. అనంతరం మరో రూ.10కోట్లకు సంబంధించిన పనులు త్వరలో టెండరు పిలవనున్నారు. ఈ క్రమంలో ఆ పనులను త్వరగా పూర్తి చేయించాల్సిన బాధ్యత ఉన్న తాధికారులదే. మరోవైపు కౌన్సిల్‌లో జరిగిన తీర్మానాలు ఓకే అయినా సంబంధిత ఫైళ్లు ముందుకు కదలాలంటే కమిషనర్ ఫైనలైజ్ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశముంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....