ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని తెలిపారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది
జార్ఖండ్‌లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్‌లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్‍సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు, విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.
విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లు, మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది.
అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి.
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించడంతో పలు ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున 1:21 గంటల సమయంలో ప్రకంపనలు చోటుచేసుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వివరాల్లోకి వెళితే...