బిహార్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా 122 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ శాతం నమోదు అయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఈ పోలింగ్ సమయం ముగిసింది.
బిహార్‌లో విజయకేతనం ఎగరేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్‌కు ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలును వెల్లడించాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఈసీ కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ నేతలు సైతం ఉన్నారు.
మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్‌లో కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ.. నగర పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తొలి విడత పోలింగ్ ఈనెల 6న జరుగగా, భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో రెండో విడత కూడా ఆదే రకంగా ఉంటే ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.