Share News

Bihar poll: రికార్డు స్థాయి ఓటింగ్ దిశగా.. ఒంటి గంటకే 47.62 శాతం

ABN , Publish Date - Nov 11 , 2025 | 03:23 PM

మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్‌లో కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది.

Bihar poll: రికార్డు స్థాయి  ఓటింగ్ దిశగా.. ఒంటి గంటకే 47.62 శాతం
Bihar polls

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారంనాడు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 47.62 శాతం పోలింగ్ నమోదు అయింది. దీంతో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.


మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్‌లో కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది. మధుబనిలో మధ్యా్హ్నం ఒంటిగంట సమయానికి 43.39 శాతం పోలింగ్ జరిగింది. అరారియాలో 46.87, ఆర్వాల్‌లో 47.11, ఔరంగాబాద్‌లో 49.45, భగల్‌పూర్‌లో 45.09, జహానాబాద్‌లో 46.07, కైమూర్‌లో 48.91, పశ్చిమ చంపరాన్‌లో 48.91, పూర్ణియాలో 49.63 శాతం, పూర్వ చంపరాన్‌లో 48.01 పోలింగ్ నమోదైంది. కీలక నియోజవర్గాలైన సుపాల్‌లో 47.66, ససరామ్‌లో 45.23, మోహనియాలో 50.97, కుటుంబలో 49.68, గయ టౌన్‌లో 39.09, చైన్‌పూర్‌లో 51.05, ధామ్‌దహాలో 50.16, హర్సిద్ధిలో 46.62, ఝాంజ్‌హార్‌పూర్‌లో 40.63 శాంత పోలింగ్ నమోదైంది.


కుటుంబ నియోజకవర్గం అభ్యర్థి, బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ ఈ-రిక్షాలో పోలింగ్ బూత్‌కు వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఎన్డీయే 180 నియోజకవర్గాల్లో గెలుపు సాధిస్తుందని బీజేపీ నేత అశ్విని కుమార్ చౌబే ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభినందించారు. ఎన్డీయే గెలుపు ఖాయమన్నారు. 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో పోలంగ్ కొనసాగుతోంది. రెండో ఫేజ్‌లో నితీష్ క్యాబినెట్‌లోని 12 మంది మంత్రులు పోటీ పడుతున్నారు. వారిలో విజయ్ యాదవ్, లేసి సింగ్, జయంత్ కుష్వాహ, సుమిత్ సింగ్, మహమ్మద్ జామాఖాన్, షీలా మండల్ తదితరులు ఉన్నారు. కాగా, తొలి విడత ఎన్నికల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 03:25 PM