DK Shiva Kumar: తుంగభద్రలో నీరున్నా కాలువలకు వదలడం సాధ్యం కాదు..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:03 PM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదన్నారు.
- మాటంటే మాటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది
- డీసీఎం డీకే శివకుమార్
బళ్లారి(బెంగళూరు): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) అన్నారు. కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయం(Tungabhadra Dam)లో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదని, రైతులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. తుంగభద్రకు నీరు వదిలితే క్రస్ట్‌గేట్లు అమర్చడం సాధ్యం కాదన్నారు.

రైతులు సహకరించకపోతే నీటి ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్లు అమర్చే విషయంలో సీడబ్ల్యూసీ, రెండు రాష్ట్రాల అధికారులు బోర్డు కమిటీ సమావేశం అయి నిర్ణయం తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 100 కార్యాలయాలు నిర్మాణం చేపట్టిందన్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం కోసం స్థలాలు ఇచ్చారని, కొందరు ఇంకా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News