Share News

Bihar Election 2025: ముగిసిన బిహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:18 PM

బిహార్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా 122 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ శాతం నమోదు అయింది.

Bihar Election 2025: ముగిసిన బిహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్
Bihar Election 2025

బిహార్‌ రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో విడతలో భాగంగా 122 స్థానాలకు ఈరోజు (మంగళవారం) పోలింగ్‌ జరిగింది. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది మహిళలే కావటం విశేషం. దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు అయింది.


కృష్ణగంజ్‌లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్ నమోదు అయింది. కతిహార్‌లో 75.23 శాతం, పూర్ణిమలో 73.79 శాతం, సుపౌల్‌లో 70.69 శాతం, పూర్వీ చంపారణ్‌లో 69.31 శాతం పోలీంగ్ నమోదు అయింది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదు అయింది. నవాడలో 57.11 శాతం, రోహ్తాస్‌లో 60.69 శాతం, మధుబణిలో 61.79 శాతం, అర్వాల్‌లో 63.06 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక, ఎన్నికలు జరిగిన 122 స్థానాల్లో వివిధ ప్రధాన పార్టీల నేతలతో సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.


ఇవి కూడా చదవండి

కారు అద్దం నుండి బయటకు వచ్చిన పాము

విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

Updated Date - Nov 11 , 2025 | 06:31 PM