Viral Video: కారు అద్దం నుండి బయటకు వచ్చిన పాము
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:16 PM
బెంగళూరులో నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళుతున్న సమయంలో సైడ్ మిర్రర్లో నుండి పాము బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన వ్యక్తి, చాకచక్యంగా కారును పక్కకు ఆపేశాడు. వెంటనే కారునుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
బెంగళూరు, నవంబర్ 11: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన అనూహ్య ఘటన షాక్ కు గురిచేస్తోంది.నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళుతున్న సమయంలో సైడ్ మిర్రర్లో నుండి పాము బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన డ్రైవర్, చాకచక్యంగా కారును పక్కకు ఆపేసి దిగిపోయాడు. అనంతరం అక్కడినుంచి పాము నెమ్మదిగా జారుకుంది. కారు నడుపుతుండగానే పాము కనిపించినా డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.
చలికాలానికి తోడు అక్కడక్కడా వర్షాలు పడటంతో ఇలా వాహనాలతో పాములు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. షూలో, బట్టల్లో దాక్కుంటాయి. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏదైనా రంద్రాలు ఉన్నా అందులో పాములు ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు పాత వస్తువులు ఇంటి చుట్టూ ఉండకుండా చూసుకోవాలి. పాత గోడలకు ఉన్న కన్నాలపై అప్రమత్తంగా ఉండాలి. అందులో నుంచి పాములు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాహనాలు పార్క్ చేసేటప్పుడు.. చెట్ల కింద, గడ్డిలో కాకుండా పొడిగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత
తుంగభద్రలో నీరున్నా కాలువలకు వదలడం సాధ్యం కాదు..