Share News

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రజాభిప్రాయంపై సర్వేల అంచనాలు ఏంటంటే..

ABN , Publish Date - Nov 11 , 2025 | 08:07 PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మరి ప్రజాభిప్రాయంపై సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రజాభిప్రాయంపై సర్వేల అంచనాలు ఏంటంటే..
Jubilee Hills Exit Polls

హైదరాబాద్ నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉపఎన్నికలో హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నెల14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజాతీర్పుపై పలు సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి (Jubilee Hills Exit Polls).

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు పలు సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు 48.5 శాతం, బీఆర్ఎస్‌కు 41.8 శాతం, బీజేపీకి 6.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ పల్స్ సంస్థ పేర్కొంది. ఇక నాగన్న సంస్థ సర్వేలో కాంగ్రెస్‌కు 47 శాతం, బీఆర్‌ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ అంచనా కట్టింది. బీఆర్ఎస్‌కు 43 శాతం, బీజేపీకి ఆరు శాతం రావొచ్చని పేర్కొంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉందని ఆపరేషన్ చాణక్య అంచనా వేసింది. హెచ్‌ఎమ్ఆర్ సర్వే, స్మార్ట్ పోల్‌ కూడా కాంగ్రెస్‌కు దాదాపు 48 శాతం ఓట్లు పోలవ్వొచ్చని అంచనా వేశాయి. బీఆర్ఎస్‌కు 43.18 శాతం ఓట్లు రావొచ్చని హెచ్‌ఎమ్ఆర్ సర్వే, 42.1 శాతం రావొచ్చని స్మార్ట్‌పోల్ సర్వే అంచనా కట్టాయి.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఈ నెల 14న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్.. అందెశ్రీ సతీమణికి ఓదార్పు

తుఫాను బాధితులకు తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు విడుదల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 11:24 PM