నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
జన్‌సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
తొలి దశ పోలింగ్‌లో వచ్చిన స్పందన తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నారని తెలిసిందని పవన్‌ఖేరా చెప్పారు. పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో చాలాచోట్ల మహాగఠ్‌బంధన్ ముందంజలో ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.
నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.