Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ECIL Recruitment 2025: మీరు ITI పాస్ అయి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సువర్ణావకాశం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 7 లోపు www.ecil.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.23,368 నుండి ప్రారంభమవుతుంది. ఐటీఐ, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2025 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) నిర్వహించిన CA ఫైనల్ మే 2025 పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ విషయంపై మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ సోషల్ మీడియాలో స్పందించారు.
జేఎన్‌టీయూలో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి.
జేఎన్‌టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.
Google Careers for Graduates: ప్రపంచ టెక్ దిగ్గడం గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కల. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇదొక అపోహ మాత్రమే. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయినవారూ గూగుల్‌లో జాబ్ సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
జేఎన్‌టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్‌కుమార్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు.
DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
పోస్టు గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.