Share News

జాబ్‌ కార్నర్‌ 19 07 2026

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:48 AM

వాయుసేనలో అగ్ని వీర్‌, ఏవీఎన్‌ఎల్‌, సీసీఐ

జాబ్‌ కార్నర్‌ 19 07 2026

వాయుసేనలో అగ్ని వీర్‌

వాయుసేనలో అగ్ని వీర్‌ పథకంలో భాగంగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు నాలుగేళ్ళ పాటు అగ్నివీర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులుగా ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ ఆటోమొబైల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులూ అర్హులే.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 26

వెబ్‌సైట్‌: iafrecruitment.edcil.co.in

ఏవీఎన్‌ఎల్

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్‌ వెహికల్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఏవీఎన్‌ఎల్‌)లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏడాది కాలానికి మొదట నియమించినప్పటికీ మరో మూడేళ్ళ వరకు పొడిగించే అవకాశం ఉంది.

పోస్టులు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 1005 - వివిధ విభాగాల్లో జూనియర్‌ టెక్నీషియన్స్‌; ఎగ్జిక్యూటివ్‌ 208 - మేనేజీరియల్‌ పోస్టులు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ సర్టిఫికెట్‌ నుంచి ఇంజనీరింగ్‌లో డిగ్రీ వరకు

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ఉద్యోగానుభవం తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 25

వెబ్‌సైట్‌: https://avnl.co.in

సీసీఐ

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 148 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఐటీ), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మార్కెటింగ్‌, అకౌంట్స్‌), జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌, జనరల్‌)

అర్హత: పోస్టును అనుసరించి సీఏ/సీఎంఏ, ఏదైనా డిగ్రీ, బీటెక్‌, ఎంబీఎ/ ఎంసీఏ ఉత్తీర్ణత

ఎంపిక: సీబీటీ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 24

వెబ్‌సైట్‌: www.cotcorp.org.in

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:48 AM