Share News

నీట్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థినులు

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:37 AM

రూర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు నీట్‌-2026లో సత్తా చాటారు. ఒకే కళాశాల ...

నీట్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థినులు

  • ఒకే కళాశాల నుంచి 9 మందికి అర్హత

ఎల్‌బీనగర్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): సరూర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు నీట్‌-2026లో సత్తా చాటారు. ఒకే కళాశాల నుంచి 9 మంది వైద్య విద్య కోర్సులకు అర్హత సాధించారు. బి.హిమాని 490 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు. జి.సుప్రియ 485 మార్కులు, బి.కల్పిత 466 మార్కులు, జి.హర్షిణి 450మార్కులు, కె.సాయి సోనియా 449 మార్కులు, ఎం.గౌతమి 448 మార్కులు, ఎస్‌.స్నిగ్ధ 432 మార్కులు, ఎల్‌.శ్రియ 408 మార్కులు, టి.ముతవ్వ 406 మార్కులు సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులను అభినందించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:37 AM