• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

సమగ్ర ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌)గా జిల్లా మారనుంది. ‘రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’లో భాగంగా జిల్లాకు రూ.1,529.69 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఉద్యాన పంటల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాలోని 27 మండలాల పరిధిలో 20 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు.

మరో రెండు రోజులే..!

మరో రెండు రోజులే..!

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్న కారణంగా కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రవాహం పడిపోతోంది. దీంతో అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.

సెక్టోరల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సెక్టోరల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో సుదీర్ఘంగా ఖాళీగా ఉన్న సెక్టోరల్‌, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ అధికారుల పోస్టుల భర్తీకి ఎట్టకేలకు బుధవారం నోటిఫి కేషన్‌ జారీ అయింది. రెండు సెక్టోరల్‌ ఏఎంవో, ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌, మూడు అసిస్టెంట్‌ సెక్టోరల్‌ పోస్టులు, రెండు ఏఎస్‌వో, ఒక ఎంపీవో పోస్టుకు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డి.అనిల్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

నేడు 591 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

నేడు 591 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

జిల్లాలో వాయిదాపడిన 591 పాఠ శాలల్లో నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్ని కలు గురువారం జరగనున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని 578 స్కూళ్లలో ఎన్నికలను వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేని కారణంగా 13 పాఠశా లల్లో ఆగిపోయాయి.

పెద్దాస్పత్రి చుట్టూ  ప్రదక్షిణలు

పెద్దాస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో వైద్య సేవలతోపాటు కొన్నిరకాల పరీక్షలు చేయించుకునేందుకు, పత్రాలు పొందేందుకు ఒకటికి పదిసార్లు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అలాగే, ఖరీదైన పరీక్షలు (కేజీహెచ్‌లో ఉచితమే) చేయించుకోవడానికి వారాల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు.

నగరం సుందరీకరణ

నగరం సుందరీకరణ

విశాఖపట్నం ప్రజలకు శుభవార్త. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు మంజూరుచేసింది. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఆగమేఘాలపై రూ.400 కోట్ల పనులు దేనికి అంటే...నవంబరులో సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దానికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అధికారులు రానున్నారు. అతిథులకు అందంగా కనిపించేలా నగరాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన.

అప్పన్నకు కొత్త రథం

అప్పన్నకు కొత్త రథం

భక్తుల సౌకర్యార్థం ‘ప్రసాద్‌’ పథకం కింద నిర్మించిన నూతన క్యూకాంప్లెక్స్‌లో రూ.15 కోట్లతో స్టీల్‌ రైలింగ్‌ ఏర్పాటు, దేవస్థానం భూముల రక్షణకు రూ.2.5 కోట్లతో సుమారు 7.5 కిలోమీటర్ల నిడివి ప్రహరీగోడ నిర్మాణానికి సింహాచలం దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది.

చర్మకారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

చర్మకారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

చర్మకారుల ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీ రుణ యూనిట్లు వెంటనే మంజూరు చేయాలని, లీడ్‌క్యాప్‌ను ప్రక్షాళన చేసి చర్మకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జు వరపు రవిప్రకాష్‌ డిమాండ్‌ చేశారు.

పారదర్శకంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ..

పారదర్శకంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ..

పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి