Share News

ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్ నియామకం..

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:20 PM

మద్యం మత్తులో యువకులు కారు ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించిన వైద్య విద్యార్థి ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్‌ నియమితులయ్యారు.

ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్ నియామకం..

రాజమండ్రి, ఆగస్టు16: మద్యం మత్తులో యువకులు కారు ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించిన వైద్య విద్యార్థి ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు సహకరించాలని రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివ ప్రియ, ప్రకాష్ నగర్ పోలీస్ సీఐ బాజీలాల్‌లను ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి.. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ వద్ద మద్యం మత్తులో కారు నడిపి.. స్కూటిని పలుమార్లు ఢీ కొట్టారు. ఈ ఘటనలో వాహనంపై ఉన్న పీజీ విద్యా్ర్థిని ప్రియాంక కిందపడిపోయింది. ఆమెను కారుతో ఢీ కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు ఆమెను తరలించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 9వ తేదీన మరణించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మమ్మల్ని అవమానిందొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం

భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

For More AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 01:25 PM