• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ జాతర సంబరం

పోలేరమ్మ జాతర సంబరం

వెంకటగిరి గ్రామశక్తిగా పేరుగాంచిన పోలేరమ్మ జాతర సంబరాలతో పట్టణం హోరెత్తిపోయింది.బుధవారం ఉదయమే పోలేరమ్మ పుట్టింటి వారుగా భావించే కుమ్మర్లు వెంకటగిరి చెరువు నుంచి తీసుకు వచ్చిన మట్టితో ప్రతిమను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.పుట్టింటి వద్ద అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచేందుకు వేపమండలతో పందిరిని సిద్ధం చేశారు.

గణే్‌షకు అభినందనల వెల్లువ

గణే్‌షకు అభినందనల వెల్లువ

జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాయుడుపేటకు చెందిన తరుమూరు గణేష్‌ మణిరత్నం స్వర్ణపతకం కైవసం చేసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుఉన్నాయి.

వారణాసి యాత్ర ప్రారంభం

వారణాసి యాత్ర ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ళ ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి నుంచి వారణాసికి సేవా సంకల్ప యాత్ర మొదలైంది.అందులో భాగంగా నగరంలోని అలిపిరి నుంచీ పాతికమంది బైక్‌ రైడర్లు చేపట్టిన బైక్‌ యాత్రను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు.

క్రేన్‌ ప్రమాదంపై ఉన్నతాధికారుల విచారణ

క్రేన్‌ ప్రమాదంపై ఉన్నతాధికారుల విచారణ

తిరుపతి డీబీఆర్‌ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌ సమీపంలో మంగళవారం భారీ క్రేన్‌ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బుధవారం ఉన్నతాధికారుల విచారణ జరిగింది.

నిర్మాణాలపై నిఘా ఏదీ?

నిర్మాణాలపై నిఘా ఏదీ?

తిరుపతి నగరంలో ఆశాశహర్మ్యాలు ఇటీవల ఎక్కువయ్యాయి. పెరుగుతున్న నగరానికి ఇవి కూడా అవసరం. అయితే నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారా? వంటి ప్రశ్నలు తాజాగా జరిగిన క్రేన్‌ ప్రమాదంతో ఉత్పన్నమవుతున్నాయి. డీబీఆర్‌ ఆస్పత్రి రోడ్డులో 13 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి పునాదులు తీస్తుండగా క్రేన్‌ కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందడం, పలువురు గాయపడడం పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.

అయ్యో.. దేవుడా!

అయ్యో.. దేవుడా!

పిల్లలంతా కలిసి వినాయక విగ్రహం పెడతామంటే సంతోషంగా చందాలిచ్చారు. మూడు రోజులుగా వాళ్లు చేసే పూజలు చూస్తూ సంతోషపడ్డారు. బుధవారం సాయంత్రం బడి నుంచి రాగానే నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లారా పిల్లలు. అలా వెళ్లిన వారిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బురదలో చిక్కుకుని అసువులు బాశారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ విషాద ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

కల్పవృక్ష వాహనంపై పార్వతీ తనయుడు

కల్పవృక్ష వాహనంపై పార్వతీ తనయుడు

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా బుధవారం కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరిస్తు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు.

భళా.. బసవన్నా..!

భళా.. బసవన్నా..!

‘మెడ మీద కాడిపెట్టి.. చెర్నాకోల చేతపట్టి.. హొయ్‌ హొయ్‌ అని అదిలిస్తే.. రయ్‌ రయ్‌మంటూ పరుగెత్తే మేటి గిత్తను నేను’ అంటూ ఒంగోలు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో ఒంగోలు జాతి గిత్తల అందాల ప్రదర్శన పోటీలు జరిగాయి.

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

సమగ్ర ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌)గా జిల్లా మారనుంది. ‘రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’లో భాగంగా జిల్లాకు రూ.1,529.69 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఉద్యాన పంటల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాలోని 27 మండలాల పరిధిలో 20 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు.

మరో రెండు రోజులే..!

మరో రెండు రోజులే..!

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్న కారణంగా కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రవాహం పడిపోతోంది. దీంతో అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి