Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తిశ్రద్ధలతో గణేశ్ చతుర్థి జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు.
మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-18పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హైవేపై ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను అధికారులు తీసుకెళ్లారు.
ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బందిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ ఘటనలో స్మగ్లర్ల దాడిలో గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి స్పందించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేతలు ఈరోజు (ఆదివారం) సందర్శించనున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.
విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం-అభీమ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.