ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 09:30 AM
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి, ఆగస్టు 13: వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిద్రమాత్రలు వాడిన ఎయిర్ ఇండియా పైలట్!
For AP News And Telugu News