ఈ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:33 PM
రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోపోతున్నారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో..
అమరావతి: రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోపోతున్నారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సోమవారం(27-04-26) ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని తెలిపారు. 23 మండలాల్లో తీవ్రమైన ఎండలు, 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. వడగాడ్పులు, ఎండ తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం వడగాడ్పులు వీచే మండలాలు(23)..
విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు.
పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు.
అల్లూరి జిల్లా: అనంతగిరి మండలం. ఈ మండలాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఇక విజయనగరంలోని 8 మండలాలు, మన్యం 1, అల్లూరి 2, పోలవరం 7, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, మార్కాపురం 1, వైఎస్సార్ 1 మండలాల్లోనూ వడగాడ్పుల ప్రభావం ఉంటుందన్నారు.
ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు..
మార్కాపురం: కంభంలో 44.7°C
నంద్యాల: ఆళ్లగడ్డలో 44.1°C
వైస్సార్ కడప: ఒంటిమిట్టలో 43.8°C
కర్నూలు: నగరడోన 43.7°C
పల్నాడు: గురజాలలో 43.7°C
నెల్లూరు: కొమ్మిపాడులో 43.5°C
అనంతపురం: భట్టువానిపల్లిలో 43.4°C
శ్రీసత్యసాయి: బుక్కపట్నంలో 43.2°C
తిరుపతి: బేస్తపల్లిలో 43.1°C
అన్నమయ్య: నూలివీడులో 43°C
ఎన్టీఆర్: చందర్లపాడు 42°C
ప్రకాశం: మొగిలిచెర్లలో 42°C
అనకాపల్లి: దేవరపల్లెలో 41.9°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలి.
చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దు.
నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
Also Read:
వైట్‌హౌస్ కరస్పాండెంట్ కార్యక్రమంలో కలకలం.. నిందితుడి టార్గెట్ ట్రంప్!
ఐపీఎల్ 2026: చెపాక్‌లో చెన్నై చిత్తు.. గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్