ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
ABN , Publish Date - Jul 17 , 2026 | 07:41 PM
పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి, జులై17: పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేపు (శనివారం) కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, మన్యం, అల్లూరి సహా 10 జిల్లాలలో వర్షాలు పడతాయని సూచించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.
అలాగే సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు స్పష్టం చేసింది. ఉరుములు, ఈదురు గాలుల సమయంలో చెట్ల కింద నిలబడ వద్దని ప్రజలకు తెలిపింది. అదే విధంగా భారీ హోర్డింగ్స్ సమీపంలో ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి కుట్ర విఫలమైంది: కేటీఆర్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ
For More AP News And Telugu News