Share News

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:09 PM

రాష్ట్రంలో రేపు (సోమవారం) ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

అమరావతి, జులై 19: రాష్ట్రంలో రేపు (సోమవారం) ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. . కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.


మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడ వద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్

రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు

For More AP News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 07:24 PM