Share News

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆర్టీజీఎస్ హెచ్చరిక

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:27 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు (బుధవారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది.

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆర్టీజీఎస్ హెచ్చరిక

అమరావతి, నవంబర్25: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు (బుధవారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, భారీ హోర్డింగుల వద్ద నిలబడ వద్దని ప్రజలకు ఆర్టీజీఎస్ సూచించింది. వర్షాల కారణంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే.. అత్యవసర నంబర్లకు కాల్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ సొంత ఆదాయంలో భారీ వృద్ధి.. రూ.74,342 కోట్లకు చేరిక

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి: కేటీఆర్

Updated Date - Nov 25 , 2026 | 03:08 PM