తిరుమలలో కొత్త జంట ఫొటో షూట్..
ABN, Publish Date - Jan 30 , 2026 | 07:37 AM
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ఉంది. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇటీవల కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహంతో అపవిత్రం చేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చూసి భక్తులు విస్తుపోయారు. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్ల మండపానికి అతి సమీపంలో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. నుదుటిపై ముద్దులు పెట్టుకుంటూ వీడియో, ఫొటోలు తీశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఈ వీడియోలో చూడండి:
ఒంటరి మహిళలే టార్గెట్.. బంగారం ధరించే వారు జాగ్రత్త.!!
యాదగిరిగుట్ట ఆలయంలో అధికారుల చేతివాటం
Updated at - Jan 30 , 2026 | 07:51 AM