500 హ్యాండ్ బ్యాగ్.. రూ.8.3 లక్షలు.. భారతీయ కళకు ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ కాపీ!

ABN, Publish Date - Sep 17 , 2026 | 10:00 AM

ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘ఫెండీ’ సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘ఫెండీ’ సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నవరాత్రుల సమయంలో రాజస్థాన్‌, గుజరాత్‌ వీధుల్లో లభించే రూ.500 విలువైన సంప్రదాయ అద్దాలు, పూసల సంచులను పోలి ఉన్న ఈ ‘ఫెండీ బ్యాగు’ను సంస్థ ఏకంగా రూ.8.3 లక్షలకు విక్రయిస్తుండటమే ఇందుకు కారణం.

భారతీయ హస్తకళను కాపీ కొట్టడమే కాకుండా లగ్జరీ బ్రాండ్‌ పేరిట రీప్యాకేజ్‌ చేయడంపై పలువురు పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. ఈ నైపుణ్యానికి కారకులైన కళాకారులకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పూర్తిగా చేతితో నేసిన ఈ బ్యాగ్‌ తయారీలో 39,500 పూసలు, 475 అద్దాలను ఉపయోగించామని, దీనికి 138 గంటలకు పైగా సమయం పట్టిందని సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.


ఇవీ చదవండి:

లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత

గతేడాది ఒక్క రాయి దాడి కూడా లేదు.. జమ్మూకశ్మీర్‌పై రక్షణ శాఖ ఆసక్తికర నివేదిక..

Updated at - Sep 17 , 2026 | 10:06 AM