తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

ABN, Publish Date - Nov 20 , 2026 | 04:32 PM

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్లు రువ్వారు.

అనంతపురం, నవంబర్ 20: జిల్లాలోని తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్లు రువ్వారు. తెలుగుదేశం కార్యకర్తలకు టపాసులు తగిలేలా పేల్చారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. తాడిపత్రిలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో ఉన్న జేసీ అనుచరులపై పెద్దారెడ్డి అనుచరులను కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పెద్దారెడ్డి ఇంటిపై నుంచి టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ శ్రేణులు గాయపడగా.. వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో రామ్మోహన్ అనే కార్యకర్త పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ప్రస్తుతం అనంత సరోజినీ ఆస్పత్రిలో రామ్మోహన్ చికిత్స పొందుతున్నారు.

Updated at - Nov 20 , 2026 | 04:40 PM