సీఎం రేవంత్‌కు హార్వర్డ్‌ పట్టా..

ABN, Publish Date - Jan 31 , 2026 | 08:43 AM

ప్రభుత్వ పాఠశాలలో చదివి రాజకీయాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో హార్వర్డ్‌ సర్టిఫికెట్‌ పొందిన తొలివ్యక్తిగా రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్‌లో ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సును పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కారు. హార్వర్డ్‌ వర్సిటీలో ఈ కోర్సుకు సంబంధించి ఈనెల 25 నుంచి వారంపాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించారు. సీఎం రేవంత్‌ కూడా తరగతులకు హాజరై.. హోం వర్కులు, అసైన్‌మెంట్లు పూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

Updated at - Jan 31 , 2026 | 09:12 AM