బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..
ABN, Publish Date - Aug 17 , 2026 | 04:19 PM
బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు..
బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని ప్రకటించారు. పార్టీ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, OBC మోర్చా నూతన ఉపాధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య పేర్లను ప్రకటించింది. అలాగే, సంస్థాగత జనరల్ సెక్రటరీగా B.L.సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 17 , 2026 | 04:19 PM