ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు: ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 12 , 2026 | 02:35 PM

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘దీపావళి మిలాన్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. జర్నలిస్టులు ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తీరును ప్రశంసించారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టర్స్ తమ ప్రాణాలను, తమ కుటుంబసభ్యుల భద్రతను పణంగా పెట్టి.. వార్తలను కవర్ చేయడం ప్రశంసనీయం అన్నారు.

Updated at - Nov 12 , 2026 | 02:38 PM