తిరుపతిలో మందు బాబు హల్‌చల్

ABN, Publish Date - Jan 03 , 2026 | 10:21 AM

తిరుపతిలో మందు బాబు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో రాత్రి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద ఆ వ్యక్తిని కిందకు దింపారు.

తిరుపతి జిల్లా, జనవరి 3: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మందు బాబు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో రాత్రి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద ఆ వ్యక్తిని కిందకు దింపారు. గోపురం పైకి ఎక్కిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా పెద్దమల్లారెడ్డి కుర్మవాడకు చెందిన తిరుపతిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ భక్తవత్సలం నాయుడు ఘటన స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు. గోపురం పైకి ఎక్కిన వ్యక్తిని డీఎస్పీ విచారించారు. అతడికి మతిస్థిమితం లేదని డీఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రధాని, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోల ప్రసారం.. వ్యక్తి అరెస్ట్

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

Updated at - Jan 03 , 2026 | 10:21 AM