ఆంధ్రా నాయకులతోనే పంచాయితీ.. కవిత సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 01 , 2026 | 02:10 PM
ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని... ఆంధ్రా రాజకీయ నాయకులతోనే పంచాయితీ అని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని అన్నారు.
హైదరాబాద్, జూన్ 1: మలి దశ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు... ఆంధ్రా రాజకీయ నాయకులతోనే మన పంచాయితీ. ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారు. తెలంగాణపై ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. దాని వెనుక కుట్ర ఉంది’ అని ఆరోపించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కవిత అన్నారు. ‘మేం అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం. ఇక్కడ ఉన్న విగ్రహాలు కూల్చుతాం. తెలంగాణలో సెటిలర్స్ అంతా మావాళ్లే. రావచ్చు.. పోవచ్చు.. రొయ్యలు అమ్ముకోవచ్చు.. షూటింగ్‌లు చేసుకొని పోవచ్చు. సెక్రటేరియట్‌లో ఏపీ నాయకులు గంటె తిప్పుతామంటే ఊరుకోం. మేము టీఆర్ఎస్ 2.0 అని గుర్తు పెట్టుకోండి. మా విధానాల్లో వేలు పెడతాం.. మా అస్తిత్వాన్ని దెబ్బకొడతామంటే ఊరుకునేది లేదు’ అని కవిత హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ
వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News
Updated at - Jun 01 , 2026 | 02:19 PM