కాశ్మీర్‌లో ఒక్క స్థానిక ఉగ్రవాది కూడా లేడు.. అమిత్ షా కీలక ప్రకటన

ABN, Publish Date - Nov 22 , 2026 | 09:01 AM

కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదంపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో అమిత్ షా ప్రసంగించారు.

కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని, ప్రస్తుతం లోయలో ఒక్క లోకల్ టెర్రరిస్ట్ కూడా లేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పుల్వామాలో భద్రతా దళాలు.. లష్కరే తోయిబాకు చెందిన చివరి స్థానిక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ యువతలో మార్పు వచ్చిందని, వేర్పాటువాదం సమసిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు.

Updated at - Nov 22 , 2026 | 09:01 AM