జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ

ABN, Publish Date - Aug 30 , 2026 | 12:53 PM

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు.. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో జరుగుతోంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సొసైటీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలు సభ్యులు కావడంతో.. తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 15స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కోటి, మహిళలకు రెండు, జనరలు 12 స్థానాలు కేటాయించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 30 , 2026 | 12:55 PM