తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

ABN, Publish Date - Jan 03 , 2026 | 08:51 AM

దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈసాన్యా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలో కన్నా ఈ ఏడాది ఎక్కువ చలి ప్రభావం చూపిస్తుంది.

ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ భారతాల్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు చలి వాతావరణం నెలకుంటుంది. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది. ఏపీ‌లోని ఉత్తర కోస్తాలో చలి తీవ్రత ఎక్కువగా దక్షిణ కోస్త రాయలసీమలో ఒక మోస్తర్గా లేదా తక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత ఉత్తరకోస్తాలో ఎండ తీవ్రత స్వల్పంగా పెరగనుంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు కూడా పొగమంచు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated at - Jan 03 , 2026 | 08:51 AM