హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
ABN, Publish Date - Jan 14 , 2026 | 05:44 PM
సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబరాలు జరుగుతున్నాయి. కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దేశ విశాల నుంచి ఫ్లయర్స్ ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్ వేదికగా ఈ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. దీనితోపాటు నగరవాసులు సైతం ఫెస్టివల్ ను తిలకించేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భారీ సైజు పతంగులు కనువిందు చేస్తున్నాయి. కైట్ ఫెస్టివల్‌తోపాటు 60 స్టాల్స్‌తో స్వీట్ ఫెస్టివల్‌నూ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన తీపి వంటకాలు నోరూరిస్తున్నాయి. ఈ కైట్ ఫెస్టివల్ మూడ్రోజులపాటు అంటే.. జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఉదయం 10:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
మరిన్ని వీడియోలు చూడండి:
పిడకలతో 4 కిలోమీటర్ల పొడుగు భోగి దండ
ఘనంగా ప్రారంభమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు
Updated at - Jan 14 , 2026 | 06:02 PM