Sankranthi Effect: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ..
ABN, Publish Date - Jan 10 , 2026 | 12:04 PM
సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. శనివారం ఉదయం నుంచే పంతంగి టోల్ ప్లాజా ప్రాంతంలో రద్దీ కనిపించింది. అలాగే చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.
Updated at - Jan 10 , 2026 | 12:04 PM