YS Jagan: అమరావతిపై జగన్ కుట్ర..? బెంగళూరు ప్యాలెస్‌లో స్కెచ్..?

ABN, Publish Date - Jan 12 , 2026 | 09:41 AM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమే వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిగా పెట్టుకున్నారు. అమవావతిపై అక్కసు, అడ్డగోలు వ్యవహారాలు, అడ్డదిడ్డమైన మాటలతో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని అధికారానికి దూరం చేసినా బుద్ధి తెచ్చుకోలేదు. అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమే వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిగా పెట్టుకున్నారు. అమవావతిపై అక్కసు, అడ్డగోలు వ్యవహారాలు, అడ్డదిడ్డమైన మాటలతో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని అధికారానికి దూరం చేసినా బుద్ధి తెచ్చుకోలేదు. అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఇటీవల అమరావతిపై జగన్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. రాజధానిపై జగన్ అలవోకగా ఏమీ మాట్లాడలేదు.. అర్థపర్థం లేకుండా కామెంట్ చేశారని ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్ మాటల వెనుక మర్మం వేరుగా ఉంది. అర్థం, పరమార్థం ఉన్నాయి. దీనివెనుక పెద్ద కథే నడిచింది. ఆ కథకు బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లో రచన, దర్శకత్వం జరిగాయి. ఆ తర్వాతే జాతీయ మీడియాను తాడేపల్లికి పిలిపించి మాట్లాడారంటే.. అమరావతిపై జగన్‌కు ఎంత అక్కసు ఉందో అర్థం చేసుకోవచ్చు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jan 12 , 2026 | 09:41 AM